విపత్తు నిర్వహణ ప్రశ్నలు 5

 1) విపత్తు అనే పదాన్ని ఇంగ్లీషులో Disaster అంటారు. ఈ పదం ఎందులో నుంచి పుట్టింది?

జ: Disastre అనే ఫ్రెంచి పదం నుంచి
2) Disastre అనే ఫ్రెంచి పదానికి అర్థం ఏంటి ?
జ: చెడు (Dis) నక్షత్రం (aster) : చెడు నక్షత్రం
నోట్: ఇటలీలో disastro అని, గ్రీకులో dusastro
3) ‘‘సమాజపు సాధారణ నిర్మాణానికి మరియు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ, అకస్మాత్తుగా మరియు తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’’ అని నిర్వచించింది ఎవరు ?
జ: ఐక్యరాజ్య సమితి (UNO)
4) విపత్తు ఒక భయంకర పరిస్థితి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. మరియు పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది. ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి అవసరమయ్యే అత్యవసర పరిణామమే విపత్తు’’ అన్న నిర్వచనం ఎవరిది ?
జ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
5) 1999-2000ల మధ్య ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో విపత్తుల మరణాల శాతం ఎంత ?
జ: 4 శాతం
6) ప్రతి ఏడాది ప్రపంచంలో విపత్తుల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య ఎంత ?
జ: 211 మిలియన్లు
7) 1980-2010 మధ్య మన దేశంలో విపత్తుల వల్ల మరణించిన వారి సంఖ్య ఎంత ?
జ: 1,43,039 మిలియన్లు
8) ప్రతి ఏడాది మన దేశంలో సంభవిస్తున్న మరణాల సంఖ్య ఎంత ?
జ: 4,334 మంది
9) విపత్తుల వల్ల భారత్ లో ఏటా ఎంత నష్టం జరుగుతోంది ?
జ: 10 బిలియన్ల డాలర్ల నష్టం
10) ప్రపంచ యుద్దాలు, ఉగ్రవాదం, నక్సలిజం, అణుబాంబులు లాంటివి ఏ విపత్తుల కిందకి వస్తాయి ?
జ: మానవకారక విపత్తులు

.

.

11) 1984లో జరిగిన పెద్ద మానవ కారక విపత్తు ఏది ?
జ: భోపాల్ గ్యాస్ దుర్ఘటన
12) వైపరీత్యాన్ని ఇంగ్లీషులో Hazard అంటారు. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఆకస్మికంగా జరిగే సంఘటననే వైపరీత్యం. అయితే ఈ పదం ఏ భాషకు చెందినది ?
జ: Hazard అనేది Hassard అనే ఫ్రెంచి పదం, Az-zhar అనే అరబిక్ పదాల నుంచి వచ్చింది
13) ఫ్రెంచి భాషలో Hazard అంటే అర్థం ఏంటి ?
జ: Chance (అవకాశం)
14) విపత్తు పరిస్థితిని లేదా నష్టం తీవ్రతను తెలుసుకోడానికి ఏవి లెక్కలోకి తీసుకుంటారు ?
జ: ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం
15) మన దేశంలో ఎంతశాతం భూమి వరదలకు గురవుతోంది ?
జ: 12శాతం ( 8శాతం తుఫాన్లకు)
16) International day for Disaster Reduction( అంతర్జాతీయ విపత్తు కుదింపు దినం )గా ఎప్పుడు పాటిస్తారు ?
జ: అక్టోబర్ 13న
(నోట్: విపత్తుల కుదింపు దశాబ్దం- 1990-99)
17) National Day for Disaster Reduction ( జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం)ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: అక్టోబర్ 29న

18) 21వ శతాబ్దం మొదటి దశాబ్దంలోనే భారత్ అనేక భయంకర విపత్తులు ఎదుర్కొంది. అవి ఏంటి  జ: 2001 లో - భుజ్ భూకంపం
2004లో - హిందూ మహాసముద్రంలో సునామీ
2008లో - కోసి నదికి వరదలు
19) భారత్ లో పునరావృతమయ్యే వరదలకు ఎంతమంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు ?
జ: 20 కోట్ల మంది ( 200 మిలియన్లు)
20) దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏయే రాష్ట్రాలు ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది ?
జ: ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్

.

.

21) సహజ విపత్తులను ఎదుర్కోవడంలో ప్రాథమిక బాధ్యత ఉంటుంది ?
జ: స్థానిక ప్రభుత్వం
22) 1556 సంవత్సరంలో ప్రపంచంలో నమోదైన మొదటి భూకంపం ఏ దేశంలో సంభవించింది ?
జ: చైనా
23) రాపిడ్ అన్ సెట్ డిజాస్టర్ కు ఉదాహరణ ఏది ?
జ: భూకంపం
24) సామాజిక ఆధారిత విపత్తు నష్ట నివారణను మన దేశంలో చేపట్టేది ఎవరు ?
జ: UNDP




No comments:

Post a Comment